కమెడియన్ అంటే గ్యాప్ లేకుండా కమిట్మెంట్ తో నవ్వించేవాడు అంటారు. స్మాల్ స్క్రీన్ లేని రోజుల్లో ఐతే కమెడియన్ అంటే ఒక ఆలీ, ఒక బ్రహ్మానందం, వేణు మాధవ్ ఇలా ఎంతో మంది గురించి చెప్పుకునే వాళ్ళం. సిల్వర్ స్క్రీన్ ప్రపంచాన్ని ఏలుతున్న ఈ టైములో బోల్డు మంది కమెడియన్స్ పుట్టుకొచ్చారు. వాళ్ళల్లో గెటప్ శీను, అదిరే అభి, పంచ్ ప్రసాద్, ధనరాజ్, రాకెట్ రాఘవ, వేణు, సుధీర్, షకలక శంకర్ ఇలా చెప్పుకుంటూ పొతే చాలా మంది ఉన్నారు. జబర్దస్త్ అనే ఒక వేదిక వీళ్ళలోని టాలెంట్ ని బయటకు తీసుకురావడానికి పుట్టిందా అన్నట్టుగా ఉండేది. 2013లో మల్లెమాల సంస్థ చేసిన ప్రయోగం పేరే "జబర్దస్త్" . అది సూపర్ సక్సెస్ అయ్యింది. రోజా, నాగబాబు జడ్జెస్ట్ గా, అనసూయ యాంకర్ గా ఉంది షోని నడిపేవారు. మూడు పువ్వులు, ఆరు కాయలుగా అన్నట్టు మొదట్లో ఇంటిల్లిపాదీ చూసి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకునేవాళ్ళు ఆడియన్స్. దీనికి పోటీ వచ్చే షో మరొకటి లేదు అన్నట్టుగా రేటింగ్ ని మూటగట్టుకుంది. ఆ ఓల్డ్ టీమ్ జబర్దస్త్ ని నిలబెట్టి వేరే వేరే కారణాలతో వెళ్లిపోయారు.
తర్వాత కొత్త నీరు వచ్చింది. అందులో సుడిగాలి సుధీర్, రష్మీ ఈ షోని ఒక రేంజ్ కి తీసుకెళ్లిపోయారు. అప్పటివరకు ఉన్న కమెడియన్స్ టీమ్ లీడర్స్ కావడం వాళ్ళ ప్లేస్ లోకి కొత్త వాళ్ళు రావడంతో ఎక్స్ట్రా జబర్దస్త్ ని స్టార్ట్ చేశారు. ఇది స్టార్ట్ అయ్యాక జబర్దస్త్ ప్రాభవం తగ్గుతూ వచ్చింది. తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ పెట్టాక ఇంకా డౌన్ అవుతూ వచ్చింది. అందులోనూ రోజా, నాగబాబు, అనసూయ, గెటప్ శీను, హైపర్ ఆది, సుధీర్, ఒక్కొక్కరిగా వెళ్లిపోయేసరికి ఆ షోకి బాడ్ టైం స్టార్ట్ అయ్యింది. కామెడీ పంచెస్ రాసేవాళ్ళు కూడా లేక వాళ్ళ మీద వాళ్ళే జోక్స్ వేసుకుని నవ్వించే పరిస్థితికి వచ్చేసింది. అందులోనూ సోషల్ మీడియాలో కిర్రాక్ ఆర్పీ చేసిన వ్యాఖ్యలు ఆ షోని మరింత డౌన్ చేసేసింది. ఏ సమస్య వచ్చినా కలిసికట్టుగా ఉండడమే తెలిసిన పాత టీమ్ తర్వాత జరిగిన పరిణామాలను చూసి బాధపడ్డారు ఎవరి వెర్షన్ వాళ్ళు వినిపించారు. ఆ బాధతో అదిరే అభి రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన ఒక లెటర్ ఫుల్ వైరల్ గా మారింది. అభి వ్యక్తపరిచిన భావాల్లో నిజం ఉందని అంటున్నారు నెటిజన్స్...ఏ స్కిట్ చూసినా జడ్జెస్ బాగుంది అంటున్నారు తప్ప సలహాలు, సూచనలు ఇవ్వడం లేదు..ఆ పాత రోజులు మళ్ళీ వస్తే బాగుణ్ణు అనుకుంటున్నారు అదిరే అభి. అందరినీ నవ్వించే జబర్దస్త్ కి మళ్ళీ నవ్వే రోజులు వస్తే బాగుండు అని మనసులోని బాధనంతా వెళ్లగక్కారు. స్కూల్స్ లో, కాలేజెస్ లో రీ-యూనియన్ , పూర్వ విద్యార్థుల కలయిక పేర్లతో ఎలా ఐతే కలుస్తారో అలా ఆ పాత జబర్దస్త్ ఫస్ట్ జెనెరేషన్ టీం అంతా కలిసి జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకొస్తే ఎంతో బాగుంటుంది అంటున్నారు జబర్దస్త్ ఫాన్స్. మరి ఆ రోజు కోసం మనం కూడా వెయిట్ చేద్దాం.